Friday, June 26, 2009

అసలు జీవితం అంటే ఏంటి

ప్రపంచంలోని ప్రాణికోటిలో మానవజాతి ఉన్నతమైనది అంటారు. ఎన్నో జన్మల పున్యభలం ఈ మానవ జన్మం

కాని మనం దాని విలువ తెలుసుకోకుండా ఉన్నాం.

ప్రపంచాన్ని కండాలుగా విడగోట్టాం

కండాలని దేశాలుగా విడగోట్టాం

అక్కడితో ఆగామా లేదు దేశాన్ని రాష్ట్రాలుగా ఆ రాష్ట్రాలని జిల్లాలుగా మండలాలుగా ఇలా విడగొట్టి గొట్టి చివరకి మనం

మన ఇంటిని మనకి ఒక పరిది లా చేసేసుకున్నాం

మతం కులం ప్రాంతం ఇలా మనిషి మనిషిని ద్వేషించుకునేకి చాలానే కారణాలు ఉన్నాయ్

కాని ప్రేమించటానికి మాత్రం ప్రయత్నించటం లేదు

ఎ మతం ఐతే ఎం ఎ కులం ఐతే ఎం మనిషి మనిషిని గౌరవించనప్పుడు అవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే

మనిషే లేనప్పుడు ఈ మతం ఎందుకు కులం ఎందుకు

ఈ మతద్వేషాలతో కులపిచ్చితో ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతూ ఉంటే అసలు నేను మనిషిగా ఎందుకు పుట్టాను

అని సిగ్గు పడుతున్న

నాకు లేదా ఈ బావాలన్ని అంటే లేదు అని నన్ను నేను మోసం చేసుకోలేను ఎంత దూరం పారిపోదమనుకున్న నేను

కూడా ఈ సమాజం లో ఒకన్నే కదా ఆ దుష్ప్రబావం నా పైన కూడా ఉంది

ఎన్నో సార్లు నా పైన నాకే అసహ్యం వేసింది కాని చెప్పా కదా నేను కూడా ఈ సమాజం లో కూపస్తామండూకం ఐపోయా అని

నేను కలలు కనే ఆ ప్రపంచం లో ఉన్నది ఒకటే మతం అది మానవతం అంతే ఆ సమాజం ఎప్పుడు వస్తుందో



1 comment:

  1. Nuv eh samajam lo okadive kani ah dushprabhavam nundi bayatapadaleva?????

    Okati perulone oka manishi ye mathamo ye kulamo thelsipoyela unde eh samajam lo marpu ravalani korukuntna...mundu manalni manam marchukunte chalga :)

    paripovadamenduku agi nilabadi chudu ne venuka enthamandi untaro :)

    ReplyDelete